పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన "బ్రో" చిత్రాన్ని USA లో రిలీజ్ చేయనుంది "పీపుల్ సినిమాస్". ఈసినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ భారీ అంచనాలను పెంచుతోంది.
"BRO" ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ స్టిల్ అభిమానులకు మంచి సప్రైజ్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. "BRO" సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని USA లో "పీపుల్ సినిమాస్" రిలీజ్ చేయనుంది.