Pooja Hegde : బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో పూజా హెగ్డే

Update: 2024-12-02 04:32 GMT

ఒక్కసారి స్టార్డమ్ అనుభవించిన తర్వాత మళ్లీ వెనకబడిపోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ వచ్చిన ప్రాజెక్ట్ ను తనకంటే చాలా వెనక వచ్చిన శ్రీ లీల వంటి హీరోయిన్ తన్నుకుపోవడం అనేది ఆ కెరీర్ కు ఓ ఎండ్ కార్డ్ లాంటిది. దీనికి తోడు వరుసగా వచ్చిన డిజాస్టర్స్ చూసి పూజాహెగ్డే కెరీర్ ముగిసిపోయిందనుకున్నారు చాలామంది. బట్ ఈ బీస్ట్ బ్యూటీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధమైంది. మరోసారి బ్యాక్ టు బ్యాక్ టు ప్రాజెక్ట్స్ తో రంగంలోకి మళ్లీ టాప్ ప్లేస్ లోకి చేరాలనుకుంటోంది. కాకపోతే ఇవన్నీ ఒకే భాషలోనివి కాదు. అంచేత టాప్ ప్లేస్ అనేది అంత ఈజీ అయితే కాదు. కాకపోతే మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుందని చెప్పొచ్చు.

గుంటూరు కారం లాస్ అయిన తర్వాత పూజాకు మళ్లీ తెలుగు సినిమా రాలేదు. బట్ ఇన్నాళ్లకు దుల్కర్ సల్మాన్ సరసన ఆఫర్ పట్టేసింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై రవి అనే కొత్త దర్శకుడు రూపొందించబోతోన్న సినిమా ఇది. ఈ మూవీతో తెలుగులో మళ్లీ సత్తా చాటాలని చూస్తోంది.

తమిళ్ లో సూర్య సరసన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కు ఆల్రెడీ సైన్ చేసి ఉంది. ఈ మూవీలో పూజా పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. వీటికంటే ముందు తను ఎప్పటి నుంచో బాలీవుడ్ లో పాగా వేయాలని చేస్తోన్న ప్రయత్నంలో భాగంగా 'దేవా' అనే మూవీ రాబోతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా ఇది. త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సో.. ప్రస్తుతం పూజా ఖాతాలో ఈ మూడు సినిమాలున్నాయి. ఈ మూడు హిట్ అయితే మళ్లీ మూడు భాషల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. లేదంటే ఎక్కడ హిట్ అయితే అక్కడే ఆగిపోతుంది. 

Tags:    

Similar News