Pooja Hegde : పూజాహెగ్డే భలే రికార్డ్

Update: 2025-07-14 10:11 GMT

తెలుగులో ఆఫర్స్ పోయినా తమిళ్ లో అదరగొడుతోంది పూజాహెగ్డే. అఫ్ కోర్స్ అక్కడ ఇప్పటి వరకూ సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు. అయినా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ యేడాది విడుదలైన రెట్రో పై చాలా ఆశలే పెట్టుకుంది. బట్ ఆ మూవీ డిజాస్టర్ గా తేలింది. ప్రస్తుతం తను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం మోనికా బెలూచీ సాంగ్. రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన ఈ మూవీలో తను చేసిన ఆ స్పెషల్ సాంగ్ ఇప్పుడు డిజిటల్ మీడియాను ఊపేస్తోంది. గతంలో తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా పాట రేంజ్ లో లేకపోయినా ఈ మూవీ వరకూ హైలెట్ గానే కనిపిస్తోంది. ఇక ఈ పాటతో పాటు పూజా చేసిన మరో రెండు పాటలు తమిళ్ ఆడియన్స్ ను కొన్నాళ్ల పాటు ఊపేస్తూ.. రీల్స్ లో వైరల్ అవడం విశేషం.

పూజాహెగ్డే తమిళ్ లో విజయ్ తో చేసిన బీస్ట్ మూవీలోని అలమ్మ బిత్తా సాంగ్ ఏ రేంజ్ లో ఊపేసిందో అందరికీ తెలుసు. సినిమా కంటెంట్ పరంగా పోయినా కమర్షియల్ గా వర్కవుట్ అయింది. అయితే ఈ పాట పెద్దగా ఎవరికీ అర్థం కాకపోయినా అదరగొట్టేసింది. అలా ఆ పాట ద్వారా తను తమిళ్ ఆడియన్స్ కు మరింత బాగా దగ్గరయింది. ఇక రెట్రో మూవీలో చేసిన మ్యారేజ్ సాంగ్ లో చేసిన స్టెప్స్ సైతం ఓ రేంజ్ లో ఊపేశాయి. నిజానికి ఈ చిన్న స్టెప్ లో మాత్రమే తను కనిపిస్తుంది. అయినా ఆ బిట్ నే వేల రీల్స్ లో రీ క్రియేట్ చేశారు జనం. ఇప్పుడు కూలీ సాంగ్ తో కుమ్మేస్తోంది. మొత్తంగా పూజాకు అక్కడ సాలిడ్ హిట్ పడలేదు కానీ.. సాడిల్ సాంగ్స్ మాత్రం మూడు ఉన్నాయి.

Tags:    

Similar News