Ponam Kaur : అల్లు అర్జున్ అరెస్ట్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన స్పందన

Update: 2024-12-14 09:30 GMT

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. ఈ అరెస్టులో రాజకీయం ఉందని, అధికార దుర్వినియోగం జరగిందనే అర్థంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంతకుముందు శుక్రవారం అల్లు అర్జున్ తో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ తన ఫేవరెట్ హీరో అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా శనివారం బన్నీకి మద్దతుగా పూనమ్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం, అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించడమే నాయకత్వం’ అంటూ పేర్కొన్నారు. జస్ట్ థాట్స్ అంటూ పూనమ్ ఈ ట్వీట్ కు క్యాప్షన్ జోడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి హీరో అల్లు అర్జున్ బాధ్యుడిగా చేయడం, అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కు మద్దతుగా రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన బన్నీని పరామర్శించేందుకు శనివారం ఉదయం ఆయన నివాసానికి ప్రముఖులు క్యూ కట్టారు. హీరోలు, దర్శకులు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు ఫ్యామిలీని పరామర్శించారు. 

Tags:    

Similar News