Prabhas : ప్రభాస్ హార్స్ రైడింగ్ ఫైట్ పూర్తి చేశాడట

Update: 2026-02-17 07:39 GMT

ప్రభాస్ సినిమాల విషయంలో క్లారిటీగా ఉన్నాడు. కథల విషయంలో మాత్రమే ఆ క్లారిటీ మిస్ అవుతోంది. అయితే ఇకపై వచ్చే మూవీస్ విషయంలో మాత్రం చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా వస్తోన్న మూవీ ఫౌజీ(వర్కింగ్ టైటిల్) లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలనుకున్నాడు. రెండు రోజుల క్రితం అతను ఆ ఫైట్ లో కిందపడిపోయాడు. చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి.దీంతో యూనిట్ అంతా గాభరా పడిపోయింది. బట్ అతను మాత్రం వెంటనే తేరుకున్నాడు. నెక్ట్స్ డేనే షూట్ లో జాయిన్ అయిపోయాడు. నిన్ననే ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా పూర్తి చేశాడు. దీంతో ప్రభాస్ లో ఇంత డెడికేషన్ ఉందా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టాకీ పార్ట్ కూడా స్టార్ట్ చేసింది యూనిట్. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో పాటు హీరోయిన్ ఇమాన్విపై కొన్ని సీన్స్ చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నారు. ఓ రకంగా యాక్షన్ సీన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంటారు స్టార్ హీరోలు. బట్ ప్రభాస్ మాత్రం అలాంటి గ్యాప్ ఏం లేకుండా నాన్ స్టాప్ గా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అన్నట్టు ఈ సీన్ లో అతను పంచె కట్టుతో కనిపించే సీన్స్ చిత్రీకరిస్తున్నారట. అంటే ప్రభాస్ పంచె కట్టులో కనిపించడం మొదటిసారి అనుకోవాలి. సో.. ఈ మూవీ స్వాతంత్ర్యానికి ముందుగా సాగే కథగా ఉండబోతోంది. మరి ఈ ఫౌజీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.

Tags:    

Similar News