హను మాన్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్థాయిలో మెరిసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. అంతకు ముందే తెలుగులో అ, కల్కి, జాంబిరెడ్డి వంటి మూవీస్ తో తన ప్రత్యేకతను చూపించాడు. హను మాన్ ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అతనికి చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి.అలాగే పోయాయి కూడా. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్నను పరిచయం చేసే అవకాశం కూడా వచ్చింది. మరి ఏమైందో కానీ అతన్ని ప్రాజెక్ట్ నుంచి తప్పించాడు బాలయ్య. అయితేనేం ప్రభాస్ తో ఛాన్స్ పట్టేశాడు. అయితే ఈ మూవీ కూడా చేజారింది అనే న్యూస్ వస్తున్నాయి.
ప్రభాస్ తో సినిమా అంటే ప్రశాంత్ వర్మకు మరో ప్యాన్ ఇండియా సినిమా పడినట్టే కదా. కానీ ప్రభాస్ లైనప్ మారుతూ వస్తోంది. ప్రస్తుతం రాజా సాబ్ చివరి దశలో ఉంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఫౌజీ(వర్కిగ్ టైటిల్) చిత్రీకరణలో ఉంది. త్వరలోనే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.ఆపై సలార్ 2 ఉంటుందని ఈ మధ్య వచ్చిన అప్డేట్స్ ను బట్టి చూస్తే అర్థమైంది.అలాగే హొంబలే బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు ఉండబోతున్నాయి. ఆ మేరకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది అంటున్నారు. అందుకే ప్రశాంత్ వర్మను పక్కన పెట్టేశాడు ప్రభాస్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. పాపం ప్రశాంత్.. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా ఖాళీగా ఉండిపోయాడు. అదీ కాక అతను 'కథ' అందించాడు అనే హైప్ తో వచ్చిన దేవకి నందన వాసుదేవ డిజాస్టర్ గా మిగిలింది. ఇదో ఎదురు దెబ్బ అతనికి.