Prabhas Raja Saab : రాజా సాబ్ గా జోకర్ లా అయిపోయిన ప్రభాస్

Update: 2025-12-29 12:12 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాజా సాబ్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మునుపెన్నడూ లేనంతగా ఉత్సాహంగా మాట్లాడాడు. ఆడియన్స్ ను నవ్వించాడు. మూవీ మేకర్స్ ను పేరు పేరు పెట్టి మాట్లాడిన విధానం బావుంది. మొత్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసిన టీమ్.. లేటెస్ట్ గా మరో కొత్త ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ప్రభాస్ ను ట్రైలర్ లో చూపించిన విధానం బావుంది. అతను చాలా డిఫరెంట్ వేరియేషన్స్ తో కనిపించాడు. సంజయ్ దత్ ను కాస్త ఎక్కువ హైలెట్ చేసేలా ప్రయత్నించారు. అతనితో పాటు ప్రభాస్ లుక్ బావుంది. హీరోయిన్ల విషయంలో మాత్రం కాస్త లైట్ తీసుకున్నారు. బట్ కంటెంట్ మాత్రం హైలెట్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. ప్రభాస్ వారి నాయనమ్మ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అది నిజమే అనిపించేలా ట్రైలర్ లో ఉంది.

‘నాయనమ్మా.. ఈ ప్రపంచంలో అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా.. ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు..’ అంటూ ప్రభాస్ డైలాగ్ తో స్టార్ట్ అయింది ట్రైలర్. ఆ ఆయన అంటే సంజయ్ దత్ అనిపించేలా కనిపించాడు. అక్కడి నుంచి ప్రభాస్ యాటిట్యూడ్ తో అదరగొట్టాడు. వినోదాత్మకంగా కనిపించాడు. ఎమోషన్ తోన ఆకట్టుకున్నాడు. భయపెట్టాడు.. భయపడ్డాడు అనిపించేలా ఉంది. చివర్లో అతన్ని జోకర్ గెటప్ లో కనిపించడం మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి టాప్ స్టార్ ను జోకర్ లాంటి గెటప్ లో కనిపించేలా చేయడంలో మారుతి దర్శకత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా ద రాజా సాబ్ 2.0 ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. 

Full View

Tags:    

Similar News