Pragya Jaiswal : వాలుకళ్లతో వయ్యారంగా.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న ప్రగ్యా

Update: 2025-04-28 07:30 GMT

మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్... అదే ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 'ఓం నమో వెంకటేశాయ' ఆధ్యాత్మిక చిత్రంలో మెప్పించింది. జయ జానకి నాయక, అఖండ, ఇటీవల డాకు మహారాజ్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. లేటెస్టుగా అఖండ–2, బెల్లంకొండ శ్రీనివాస మూవీ టైసన్నాయుడులోనూ కీ రోల్ ప్లే చేస్తోంది. అయితే ఒకవైపు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తేన్న ఈభామ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్ లో కిర్రాక్ ఫొటోస్ క స్టిల్స్ ఇచ్చింది. ప్రగ్యా అమాయక చూపులకు ఫ్యాన్సీ ఫిదా అయిపోతున్నారు. మెడలో నెక్లెస్ పెట్టుకుని వాలుకళ్లతో వయ్యారంగా చూస్తూ వావ్ అనిపించింది. ఇక ఈ ఫొటోస్ కు 'డ్రెస్ వేసుకున్న క్షణం' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News