Prakash Raj: ఆ వీడియోలు బయటపెట్టాలి: ప్రకాశ్‌రాజ్ డిమాండ్

Prakash Raj:ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌రాజ్ లేఖ

Update: 2021-10-14 10:16 GMT

Prakash Raj: 'మా' ఎన్నికలు ముగిసినా వివాదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. పోలింగ్ రోజు సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ.. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌రాజ్ లేఖ రాశారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడం మా హక్కుని, వీలైనంత త్వరగా ఆ ఫుటేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేస్తే ఫుటేజ్ డిలీట్ లేదా ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 3 నెలలు సీసీ ఫుటేజ్ జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల అధికారిదేనని గుర్తు చేసిన ఆయన.. మా ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చాలా జరిగాయంటూ లేఖలో పేర్కొన్నారు.

మోహన్‌బాబు, మా మాజీ అధ్యక్షుడు నరేష్‌ దారుణంగా ప్రవర్తించారని అన్నారు. తిట్టడం, బెదిరించడమే కాదు.. కొందరు 'మా సభ్యులపై' దాడి చేశారని కూడా ప్రకాష్‌రాజ్ ఆరోపించారు. పోలింగ్ ఏరియాలోకి వాళ్ల వర్గీయులు ఎలా చొరబడ్డారో తెలియాలంటే, ఆ ఉద్రిక్తతలకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని ప్రకాష్‌రాజ్ డిమాండ్‌ చేశారు. కొందరు ప్రముఖులు వ్యవహరించిన తీరు పబ్లిక్‌ అసహ్యించుకునేలా ఉందని అన్నారు.

మా ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లంతా రాజీనామా చేశారు. కొందరు అతి జోక్యాన్ని సహించలేమని ఇండైరెక్ట్‌గా చెప్తూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఆ వివాదం ఇంకా మరువక ముందే సీసీ ఫుటేజ్ కావాలాని ప్రకాష్ రాజ్ లేఖ రాయడంతో మళ్లీ రచ్చ మొదలైనట్టు కనిపిస్తోంది. 



Tags:    

Similar News