Prakash Raj: ప్రకాష్‌రాజ్ అసలు పేరేంటి.. పేరు మార్చింది ఎవరు?
Prakash Raj: ప్రకాష్‌రాజ్ పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్ నటుడు కాకపోయిన తెలుగువారు అతడిని ఓన్ చేసుకున్నారు.;
Prakash Raj (tv5 news.in)
Prakash Raj: ప్రకాష్‌రాజ్ పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్ నటుడు కాకపోయిన తెలుగువారు అతడిని ఓన్ చేసుకున్నారు. తెరపై నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని విభిన్న పార్శ్వాలకు పదునుపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నిజానికి తన పేరు ప్రకాశ్‌రాయ్ అని అయితే తన పేరు ప్రకాశ్‌రాజ్‌గా ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ మార్చారని అన్నారు. చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండడంతో నాటకాలు వేస్తుండేవారు. అవి చూసే సీనియర్ నటి లక్ష్మి సౌతిండియాలో గొప్ప నటుడవు అవుతావని అన్నారు.
మరో ఆర్టిస్ట్ గీత ప్రకాష్ రాజ్ ఫోటోలను కె. బాలచందర్‌కు పంపించారు. ఓసారి చెన్నై వెళ్లి ఆయన్ను కలిశారు ప్రకాష్‌రాజ్. 9 నెలల తరువాత ఓ ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి సినిమాలో ఓ రోల్ చేయాలి వెంటనే రమ్మన్నారు.
అలా కె.బాలచందర్ దర్శకత్వంలో డ్యూయెట్ అనే సినిమా చేశారు ప్రకాష్‌రాజ్. ఆయనే ప్రకాష్‌రాయ్ పేరుని ప్రకాష్‌రాజ్ చేశారు. సినిమా పెద్దగా ఆడకపోయినా బాలచందర్ దర్శకత్వంలో చేయడంతో తన సినిమా కెరీర్‌కి ఉపయోగపడిందని చెబుతారు.
అయితే సినిమా జీవితం మొదలైంది డ్యూయెట్ సినిమాతో కాబట్టి తన నిర్మాణ సంస్థకి డ్యూయెట్ ఫిల్మ్ అని పేరు పెట్టుకున్నారు. ప్రకాష్‌రాజ్ కారు వెనుక కూడా అదే పేరు ఉంటుంది.