Prem Kumar : U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న లవ్ అండ్ ఎంటర్టైనింగ్
'ప్రేమ్ కుమార్' కు U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు;
ఇటీవలే అన్నీ మంచి శకునములే సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరో సంతోష్ శోభన్ ఇప్పుడు తన కొత్త చిత్రం ప్రేమ్ కుమార్ తో రాబోతున్నాడు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను సారంగ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ ఇటీవలే అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కాగా తాజాగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు..U/A సర్టిఫికేట్ జారీ చేసిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆదిత్య మ్యూజిక్.. 'ప్రేమ్ కుమార్ గాడి పెళ్లి గోల అందరి వీక్షణకి అని తేలిపోయింది.U/A సర్టిఫికెట్ వచ్చేసిందంటూ' క్యాప్షన్ లో జోడించింది. దాంతో పాటు మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. ఈ పోస్టర్ లో సంతోష్ శోభన్ క్యాప్ పెట్టుకుని, సూట్ లో కనిపిస్తుండగా.. చేతి వేళ్లకు తాళి చుట్టబడి ఉంది. తన రెండు చేతి వేళ్లు మూవీకి U/A సర్టిఫికెట్ వచ్చిందని తెలియజేస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో తీసిన ఈ సినిమాకు దర్శకుడు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగా మన సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి సమయంలో పారిపోవటమో, ఫైట్ చేసి కలిసిపోవటమో జరుగుతుంటుంది. అది ఎక్కువగా హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ వచ్చారు. మరి పెళ్లి పీటల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవరూ చూపించలేదు. ఉన్నా ఏ ఒకట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్ నాకు ఆసక్తికరంగా అనిపించింది. పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ యువకుడు మానసికంగా ఎలాంటి బాధను అనుభవిస్తాడు. అతని కుటుంబానికి వచ్చే సమస్యలు ఏంటి? అనే దాన్ని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించామని ఇటీవల ఈ సినిమా నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు తెలిపారు.
.@PremKumarPelli గాడి పెళ్ళి గోల అందరి వీక్షణ కి అని తేలిపోయింది!
— Aditya Music (@adityamusic) August 16, 2023
U/A certificate వచ్చేసింది!#PremKumar#WhereIsPK#PremKumarOnAUG18@santoshsoban @abhimaharshi1 @shiva6111 @RashiReal_ @KrishnaTeja_D @cerebrahma @SharangaOffl @adityamusic pic.twitter.com/ic782JQj58