ZayedMasood The Emperor’s General.మళయాలంలో రూపొందిన లూసీఫర్ అక్కడి ఎన్నో రికార్డ్స్ ను బద్ధలు కొట్టింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి విజయం అందుకున్నాడు. బట్ ఒరిజినల్ అంత పెద్ద హిట్ కాదు. ఇక మోహన్ లాల్, పృథ్వీ కాంబోలో ఆ తర్వాత వచ్చిన బ్రో డాడీ సైతం బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబోలో మూడో సినిమా కూడా అనౌన్స్ అయింది. లూసీఫర్ కు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ''ఎల్ 2 ఎంపూరన్" అనే టైటిల్ ఖరారు చేశారు.
లూసీఫర్ లో చివర్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అదరగొట్టాడు దర్శకుడు పృథ్వీరాజ్. ఆ అప్పీరియన్స్ కు థియేటర్స్ లో అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. తెలుగులో చిరంజీవి కోసం ఆ గెస్ట్ రోల్ ను సల్మాన్ ఖాన్ చేశాడు. అయితే ఈ పాత్రను ఈ సారి మరింత ఎక్స్ టెండ్ చేశాడు పృథ్వీరాజ్. ఎంపరర్ జనరల్ గా తన పాత్రను పెంచాడు. ఆ పాత్ర లుక్ ను పరిచయం చేస్తూ లేటెస్ట్ గా విడుదల చేసిన స్టిల్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. ఓ కమెండో లాగా చేతిలో పెద్ద గన్ పట్టుకుని బ్లాక్ సన్ గ్లాస్ తో చాలా స్టైలిష్ గా ఉన్నాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా ట్రెండ్ బాగా ఉంది కాబట్టి ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. సో.. మెగాస్టార్ కు ఈ సీక్వెల్ ను రీమేక్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఏదైనా.. ఈ మళయాలం వాళ్ల స్పీడే స్పీడబ్బా..