Priyanka Chopra: మా క్యూట్ బంగారుకి 'హాయ్' చెప్పండి: ప్రియాంక చోప్రా
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సరోగసి ద్వారా బిడ్డని కన్నదని తెలిసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పనిలేని కొందరు వ్యక్తులు..;
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సరోగసి ద్వారా బిడ్డని కన్నదని తెలిసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పనిలేని కొందరు వ్యక్తులు.. అలా ఎందుకు చేశానో నాకు మాత్రమే తెలుసు.. దాని గురించి మీకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదని ప్రియాంక చోప్రా ఒకింత ఘాటుగానే స్పందించింది.
దాంతో సదరు వ్యక్తులు షాక్‌కి గురై కిమ్మనకుండా ఊరుకున్నారు. ఇన్ని రోజులు తన కూతురు మాల్తీ మేరీని చూపించని ప్రియాంక ఈ రోజు తన బంగారు తల్లిని అందరికీ పరిచయం చేసింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి భర్త నిక్ జోనాస్, కూతురు మాల్తీతో హాజరై సందడి చేసింది ప్రియాంక చోప్రా.
మాల్తీ మేరీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్యూట్ బంగారం పోలికలు అచ్చం వాళ్ల నాన్నలా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చిన్నారికి తమ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు. ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.
వీరు తమ వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో మరియు హిందూ సంప్రదాయంలో కూడా నిర్వహించారు. తరువాత, ఈ జంట ఢిల్లీ, ముంబైలలో తమ స్నేహితులకు, బంధువులకోసం రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ జంట గత ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా తమ బిడ్డను స్వాగతించారు.
కాగా, ప్రియాంక 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ' మరియు సిరీస్ 'సిటాడెల్' వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. రస్సో బ్రదర్స్ నిర్మించిన 'సిటాడెల్' ప్రైమ్ వీడియోలో OTT ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది.
ప్రియాంక నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్‌కు ప్యాట్రిక్ మోర్గాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడెన్ నటించారు.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, ఆమె ఫర్హాన్ అక్తర్ యొక్క 'జీ లే జరా'లో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో కలిసి నటిస్తోంది. ఇది 'దిల్ చాహ్తా హై' మరియు 'జిందగీ నా మిలేగీ దొబారా' తరహాలో మరొక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు. 'జీ లే జరా' త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.