Balakrishna : బాలయ్యతో దిల్ రాజు.. యంగ్ డైరెక్టర్ కి క్రేజీ ఛాన్స్..!
Balakrishna :టాలీవుడ్‌లో వన్ అఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ లలో దిల్‌రాజు ఒకరు.. కథల పై మంచి టేస్ట్, గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్‌గా దిల్‌రాజుకి మంచి పేరుంది.
Balakrishna :టాలీవుడ్‌లో వన్ అఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ లలో దిల్‌రాజు ఒకరు.. కథల పై మంచి టేస్ట్, గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్‌గా దిల్‌రాజుకి మంచి పేరుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంటారు దిల్ రాజు.. సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ లతో మూవీస్ చేసిన దిల్ రాజు.. చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రం చేయలేకపోయారు. వీరితో సినిమాలు చేయడం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారాయన.. అయితే బాలకృష్ణతో మూవీ చేసే ఛాన్స్ త్వరలోనే నెరవేరనుందని తెలుస్తోంది.
అఖండ మూవీతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన బాలయ్య... ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమాని చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు బాలయ్య.. ఆ తర్వాత దిల్‌రాజుతో బాలయ్య మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. తాజాగా బాలయ్య బాగా సెట్ అయ్యే కథను వినిపించారట దిల్ రాజు.. బివిఎస్ రవి ఈ కథని రాయగా.. ఆయనే మూవీని కూడా డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం.
బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ షోకి బివిఎస్ రవినే డైరెక్ట్ చేయడం, ఆ షో కూడా ఫుల్ సక్సెస్ అవ్వడంతో బాలయ్య అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గోపీచంద్ వాంటెడ్, సాయి ధరమ్ తేజ్ జవాన్ మూవీస్‌కి దర్శకత్వం వహించాడు బివిఎస్ రవి.