సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటాడు. చిన్న విషయాలను కూడా పెద్ద కర్రతో కొడుతుంటాడు. కొన్నిసార్లు మాటలు తూలినట్టు కనిపించినా అదంతా తన స్టైల్ అని జనాలకు అర్థమైంది. అయితే లేటెస్ట్ గా అతను చెప్పిన ఒక మాట మాత్రం మీడియాకే కాదు.. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అది ఎన్టీఆర్ కు సంబంధించిన వార్త కావడమే అందుకు కారణం. కొన్ని రోజులుగా జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగులో డైరెక్షన్ చేయబోతున్నాడు అనేది వింటున్నాం. అది సితార బ్యానర్ లోనే అని కన్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీ ఎన్టీఆర్ తో ఉంటుందనేది అప్పటి నుంచి సర్క్యులేట్ అవుతున్న న్యూస్. బట్ అది నిజం కాదు అని చెప్పి బాంబ్ పేల్చాడు నాగవంశీ.
తాజాగా ఎన్టీఆర్, నెల్సన్ మూవీ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది అని అడిగితే.. ‘‘హీరో దొరికినప్పుడు’’ అని సమాధానం చెప్పాడు. హీరో ఎన్టీఆర్ కదా అని అడిగితే.. అది మీరు అనుకుంటున్నారు మేం కాదు అన్నాడు. అంతే కాదు.. నెల్సన్ తో తను సినిమా చేయబోతుండటం నిజం. కానీ హీరో ఇంకా ఫైనల్ కాలేదు అన్నాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ తో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా లేక.. నిజంగానే నెల్సన్ తో చేసే సినిమా ఎన్టీఆర్ ది కాదా అసలు సడెన్ గా ఈ ట్విస్ట్ ఏంటీ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు జనం.