Shyam Prasad Reddy : నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య మృతి

Update: 2024-08-08 05:40 GMT

ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (62) మరణించారు. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె అయిన వరలక్ష్మిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు8 పిల్లలున్నారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

Tags:    

Similar News