టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్.. మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 62యేళ్ల వయసులో మరణించారు. వరలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమార్తె. అయినా ఎప్పుడూ ఆడంబరాలు లేకుండా భర్త చాటు భార్యగానే జీవించారు.
ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. రచయితగా, కవిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.
శ్యామ్ ప్రసాద్ మల్లెమాల ప్రొడక్షన్ లోకి అంకుశం నుంచి చురుకుగా ఉన్నారు. తర్వాత అమ్మోరు, అంజి, అరుంధతి వంటి మంచి సినిమాలు ఈ బ్యానర్ లో రూపొందాయి. కొన్నాళ్లుగా టివి రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మల్లెమాల ప్రొడక్షన్స్ పేరుతోనే జబర్దస్త్ అనే షోను స్టార్ట్ చేశారు. మొత్తంగా శ్యామ్ ప్రసాద్ కు ఈ వయసులో భార్యా వియోగం తీరని లోటు అనే చెప్పాలి.