రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తోన్న రాజా సాబ్ వాయిదా పడటం అభిమానులకు నచ్చలేదు. చెప్పిన టైమ్ కు వచ్చి ఉంటే సమ్మర్ లోనే రికార్డులు బ్రేక్ చేసి ఉండేదీ మూవీ. బట్ పోస్ట్ పోన్ అయింది. కొత్త డేట్ గా ఆ మధ్య డిసెంబర్ 5న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కొన్ని రోజులుగా ఆ డేట్ కూడా మారబోతోందని.. రాజా సాబ్ 2026 సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. అది మంచి సీజనే కాబట్టి అంతా నిజమే అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఇన్ని రోజులు ఆగాం కదా సంక్రాంతి అంటే మరో నెల రోజులే కదా అని అనుకుంటున్నారు. అయితే రిలీజ్ డేట్ గురించి నిర్మాత నిర్మాత విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చాలామంది అడుగుతున్నారు అనేది వాస్తమే అన్నాడు. అభిమానులూ అదే కోరుకుంటున్నారని.. బయ్యర్స్ సైతం ఆ డేట్ అయితే బావుంటుందన్నారు అన్నాడు. బట్.. అన్నీ చూసుకునే మేము డిసెంబర్ 5న ఫిక్స్ అయ్యాం. మహా అయితే ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 6న రావొచ్చు. కానీ సంక్రాంతి వరకూ ఆగడం లేదు అని స్పష్టం చేశాడు.
హిందీ నుంచి భారీ బడ్జెట్, భారీ తారాగణంతో కూడిన 'దురంధర్'అనే చిత్రం వస్తోంది. ఇది రాజా సాబ్ కు గట్టి పోటీ ఇస్తుందనే టాక్ ఉంది. అయితే దురంధర్ వాయిదా పడే అవకాశాలే ఉన్నాయట. అందుకే రాజా సాబ్ ను డిసెంబర్ 5నే విడుదల చేస్తాం అన్నాడు నిర్మాత.
ఇక కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ సినిమాగా రాజా సాబ్ రూపొందుతోంది. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సో.. రెబల్ ఫ్యాన్స్.. గెట్ రెడీ ఫర్ డిసెంబర్.