Project K : రామోజీ ఫిలింసిటీలో ప్రాజెక్ట్ కే షూటింగ్..
Project K : మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.;
Project K : ప్రభాస్ నాగ్‌అశ్విన్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కారు చేజింగ్ సీన్స్, ఫైట్ సీన్స్‌ను ఫలిం సిటీలో షూట్ చేస్తున్నారు. దీపక పదుకొనే హీరోయిన్ గా నటించనుండగా.. అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
నాగశ్విన దీనికి దర్శకత్వం వహిస్తుంటే.. అశ్వినీ దత్ నిర్మించనున్నారు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కారును ఆనంద్ మహేంద్ర ప్రత్యేకంగా తయారుచేయించిన విషయం తెలిసిందే. మిక్కీ-జె-మేయర్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. సుమారు రూ.500 కోట్ల రూపాయలతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.