ఫ్లాపుల్లో ఉన్న దర్శకులంటే రూమర్ రాయుళ్లకు భలే అలుసుగా ఉంటుంది. అందుకే రోజుకో వార్త పుట్టిస్తుంటారు వాళ్ల మీద. కాకపోతే కొన్నిసార్లు ఇవి నిజం అవుతాయి కూడా. ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న పూరీ జగన్నాథ్ కొన్నాళ్లుగా ఫ్లాపింగ్ డైరెక్టర్ గా మారాడు. అందుకే అతని పేరు చెబితే హీరోలే కాదు నిర్మాతలు కూడా పారిపోతున్నారు. ఈ టైమ్ లో రీసెంట్ గా గోపీచంద్ హీరోగా గోలీమార్ 2 తీయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అటు గోపీచంద్ కూడా అంతే వరుస డిజాస్టర్స్ లో ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఏం వినిపించలేదు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, అక్కినేని అఖిల్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.
పూరీ జగన్నాథ్, అఖిల్ మధ్య ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని.. అవి ఓకే అయితే వీరి కాంబోలో సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమా కాదా అనేది తర్వాతి సంగతి కానీ.. ప్రస్తుతం అఖిల్ ఉన్న పరిస్థితికి పూరీకి ఛాన్స్ ఇస్తే మళ్లీ మొదటికే మోసం వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ కు బాగా తెలుసు.
పైగా అతనిప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటి ‘లెనిన్’. మరొకటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే భారీ బడ్జెట్ మూవీ. ఈ టైమ్ లో మళ్లీ వెనక్కి వచ్చి పూరీతో మూవీ అంటే కాస్త ఇబ్బందే అవుతుంది అతనికి. ఒకవేళ పూరీ చెప్పిన కథ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటే మాత్రం ఆలోచించొచ్చు. కానీ అతని కథలేం మారలేదు అని చివరగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’చూస్తే అర్థం కాలేదూ.. ? ఏదేమైనా హీరోలిద్దరూ, దర్శకుడు ఫ్లాపుల్లోనే ఉన్నారు. మరి ఈ రూమర్ ఎవరి తో నిజం అవుతుందో చూడాలి.