ఐకానిక్ స్టార్ బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప ది రూల్. ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఓవర్సీస్ లో అత్యంత వేగంగా 'పుష్ప 2' వన్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది. ఈ సినిమా కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల 5న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఓవర్సీస్లోలో ప్రీ సేల్ బుకింగ్లో మిలియన్ డాలర్ల మారకన్ను చేరుకుంది. అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మారకు చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది' అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. దీంతో బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు.