Pushpa 2 : పుష్ప 2 బాహుబలి 2 ను దాటేసినట్టే

Update: 2025-01-03 06:00 GMT

అల్లు అర్జున్ పుష్ప 2 అరుదైన ఫీట్ సాధించేందుకు అతి దగ్గరలో ఉంది. ఇప్పటికీ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓ సాధారణ మాస్ మసాలా మూవీ ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తోందంటే చాలామందికి ఆశ్చర్యంగానే ఉంది. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని చోట్ల నష్టాలూ వచ్చాయి. బట్ నార్త్ లో మాత్రం నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. ఓ వైపు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో కేస్ ల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చినా.. ఆ మూవీపై హైదరాబాద్ లో కాంట్రవర్శీ కంటిన్యూ అవుతున్నా.. నార్త్ స్టేట్స్ లో కలెక్షన్స్ తగ్గడం లేదు. ఇదే విషయమై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ, బోనీ కపూర్ మధ్య సాగిన మాటల యుద్ధం బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా మార్చాయి.

బాహుబలి ఫస్ట్ పార్ట్ తో కంట్రీ మొత్తాన్ని మెస్మరైజ్ చేసినా కంటెంట్ బలంగా లేకపోవడంతో సెకండ్ పార్ట్ తో రికార్డులు క్రియేట్ చేశాడు రాజమౌళి. ఆ టైమ్ లో ప్రభాస్ పెద్ద స్టార్ గా ఎదిగాడు. సెకండ్ పార్ట్ తో అది వర్కవుట్ అయింది. పైగా ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో కనిపిస్తుంది. అలాంటివేం లేకుండానే పుష్ప 2 ఈ రేంజ్ వసూళ్లు సాధించడం విశేషం కాదు.. ఆశ్చర్యం అంటున్నారు చాలామంది. ఈ కలెక్షన్స్ తో అతి త్వరలోనే బాహుబలి 2 లైఫ్ టైమ్ వసూళ్లను దాటిపోతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్నాల మ్యాజిక్ కు 1799 కోట్ల మార్క్ ను దాటింది. బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ 1810.65 కోట్లు.ఈ ఫిగర్ ను దాటాలంటే పుష్పరాజ్ కు ఇంకా 12 కోట్లే కావాలి. సంక్రాంతి బరిలో హిందీలో పెద్ద సినిమాలున్నా.. ఇంకా అక్కడ పుష్పరాజ్ హవానే కనిపిస్తోంది. అందువల్ల బాహుబలి 2 రికార్డ్ ను దాటేయడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పటి వరకూ ఇండియాలో హయ్యొస్టె కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 1914 కోట్లో దంగల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది. సో.. ఇప్పుడా ప్లేస్ అతి త్వరలోనే పుష్ప 2 ఆక్యుపై చేయబోతోంది.

విశేషం ఏంటంటే.. బాహుబలి 2, దంగల్ చిత్రాలకు ఇతర దేశాలతో పాటు చైనా మార్కెట్ నుంచి భారీ వసూళ్లు వచ్చాయి. బట్ పుష్పకు వేరే మార్కెట్ అంటూ పెద్దగా ఏం లేదు. కేవలం హిందీ మార్కెట్ తోనే ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఒకవేళ బలమైన కంటెంట్ ఉండి.. తెలుగు స్టేట్స్ లో టికెట్ రేట్లు సాధారణంగా ఉండి ఉంటే దంగల్ ను కూడా సులువుగానే దాటేసేదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 

 

Tags:    

Similar News