Ustad Bhagatsingh : పవన్ కల్యాణ్ సరసన రాశీఖన్నా.. ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలో మరో కథానాయికగా రాశీఖన్నాను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో రాశీ ఖన్నా భాగమైనట్లు టీమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. అయితే, సినిమాలో మరో కీలక పాత్ర కోసం రాశీఖన్నాను తీసుకోవాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ కారణంగా 'ఉస్తాద్ భగత్‌సింగ్' షూటింగ్ కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగవంతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన 'తెరీ' చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ ఇది కేవలం స్ఫూర్తితో తీస్తున్న స్వతంత్ర కథ అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయనను పవర్‌ఫుల్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.