Raashi Khanna : నేను అనుకున్నది జరగలేదు : రాశీఖన్నా

Update: 2024-10-28 09:45 GMT

అందం, అభినయంతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశీఖన్నా. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందివచ్చిన అవకాశాలన్నింటీని వాడుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన పోస్టులతో కుర్రకారును తన వైపు తిప్పుకుంటుంది. అయితే రీసెంట్ గా సదరన్ రైజింగ్ సమ్మిట్లో పాల్గొన్న రాశీఖన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నేను విధిని నమ్ముతాను, నేను కోరుకున్నది ఏదీ ఇప్పటి వరకు నాకు దక్కలేదు. నిజానికి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నాను. కానీ అది జరగలేదు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగే వారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని అనుకుంటారు. నేను కూడా అలానే ఐఏఎస్ అయితే రక్షణగా ఉంటుంది కచ్చితంగా చేయాలి అనుకున్నా, సబ్జెట్లో కూడా నేను టాపర్. కానీ నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు. ఆయన అనుకున్న దాని ప్రకారమే నేను ఇప్పుడు నటి అయ్యాను అంటూ రాశిఖన్నా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News