Radhe Shyam : రాధేశ్యామ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!
Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.;
Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. నవంబర్ 15(సోమవారం)న సాయింత్రం అయిదు గంటలకి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్.. 'నీ రాతలే' ను విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రానున్న ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి కలిసి ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది. కాగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.