Radhe Shyam: ఫ్యాన్స్‌తో ట్రైలర్ లాంచ్ చేయిస్తున్న పాన్ ఇండియా స్టార్..
Radhe Shyam: రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అందమైన పిరియాడిక్ ప్రేమకథ ‘రాధే శ్యామ్’;
Prabhas (tv5news.in)
Radhe Shyam: రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అందమైన పిరియాడిక్ ప్రేమకథ 'రాధే శ్యామ్'. ఇందులో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ సినిమాల మధ్య ఈ అందమైన ప్రేమకథ సంక్రాంతి బరిలో దిగనుంది. అయితే ఈ సినిమా నుండి వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
రాధే శ్యామ్ నుండి ఇప్పటికే పాటలు విడుదల అవుతూ ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి ప్రేమకథ అని వివరించే లాగా ఉన్న పాటలన్నీ మెలోడీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఈ పాటలు సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రాధే శ్యామ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. హిందీ ప్రేక్షకులు కూడా అంతే ఎదురుచూస్తున్నారు.
జనవరిలో రాధే శ్యామ్ విడుదల ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 23న ప్లాన్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని ఫిల్మ్ సర్కిల్లో టాక్. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 1980ల్లోని యూరప్ సెట్ వేయనున్నారట. అంతే కాకుండా ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్ చేతుల మీదుగా విడుదల చేయాలని రాధేశ్యామ్ టీమ్ ఫిక్స్ అయ్యింది. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Witness the first-ever trailer launch event by the fans in Indian cinema. 23rd December, Ramoji Film City, Hyderabad.#RadheShyam #RadheShyamPreReleaseEvent #Prabhas @hegdepooja @director_radhaa @TSeries @UV_Creations @AAFilmsIndia @GopiKrishnaMvs @RadheShyamFilm pic.twitter.com/b9aOV3V2E6
— Prabhas (@PrabhasRaju) December 18, 2021