Radhe Shyam Release Date: 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్'? క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..
Radhe Shyam Release Date: జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ సినిమా విడుదల కావాల్సి ఉంది.;
Radhe Shyam Release Date: జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కాని, ఒమిక్రాన్ విజృంభిస్తున్నందున వాయిదా వేసే విషయంపై డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా మూవీ కావడం, పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతుండడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా సినిమాలు కచ్చితంగా ప్రతీ భాషలో విడుదల అవుతేనే.. బడ్జెట్‌కు తగ్గ కలెక్షన్లు వస్తాయి. ఏ ఒక్క భాషలో ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఎక్కువశాతం ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదల అవుతున్నాయి. కానీ ఒమిక్రాన్ వల్ల నార్త్ స్టేట్స్‌లో సినిమాల విడుదల కష్టంగా మారింది. అందుకే రాధే శ్యామ్ విడుదలపై కూడా ప్రేక్షకులలో సందేహాలు మొదలయ్యాయి.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన 'రాధే శ్యామ్'లో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ట్రైలర్, పాటలు రాధే శ్యామ్‌పై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో జనవరి 14న సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న అభిమానులు అందరూ వాయిదా రూమర్స్ విని కాస్త అసంతృప్తి చెందారు. కానీ రాధే శ్యామ్ వాయిదా పడట్లేదని ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్.