Radhe Shyam Release Date: 'రాధే శ్యామ్'కు ఇదే అడ్వాంటేజ్.. ఇక కలెక్షన్ల విషయంలో ఢోకా లేదు..!
Radhe Shyam Release Date: ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ క్రియెట్ చేశారు. ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేశారు.;
Radhe Shyam Release Date: ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ క్రియెట్ చేశారు. ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేశారు. కోట్లాది మంది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించారు. కానీ పరిస్థితులు కరుణించడం లేదు. కరోనా, ఒమిక్రాన్ దెబ్బకు వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మళ్లీ వాయిదా పడింది. కానీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మాత్రం సంక్రాంతి బరిలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈనెల 14న రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడటంతో అన్ని థియేటర్లలో రాధేశ్యామ్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కర్ఫ్యూ ఉన్న రాష్ట్రాల్లో రాత్రి ప్రదర్శించే రెండు షోలు నిలిపివేసి సినిమా ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తొలుత ట్రిపుల్ ఆర్ 2 వేల 500 థియేటర్లలోను, రాధేశ్యామ్ 15 వందల థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అయితే ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో రాధేశ్యామ్ సినిమాను మొత్తం 4 వేల థియేటర్లలో రిలీజ్ అవకాశం ఉంది.