Radhe Shyam Trailer: ప్రేమకు, విధికి జరిగే యుద్ధమే 'రాధే శ్యామ్'.. రిలీజ్ ట్రైలర్‌లో ఇదే హైలెట్..
Radhe Shyam Trailer: రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి మరింత స్పష్టంగా వివరించారు.;
Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను పూర్తిస్థాయి లవర్ బాయ్‌గా చూసి చాలాకాలమే అయ్యింది. అందుకే తనలోని లవర్ బాయ్‌నుు మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు రాధాకృష్ణ. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే 'రాధే శ్యామ్'. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మార్చి 11న రాధే శ్యామ్ విడుదల కానుంది.. త్వరలోనే మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ పనుల్లో బిజీ కానుంది. అందులో భాగంగానే ముందుగా రిలీజ్ ట్రైలర్‌ను వదిలారు. అయితే ఇప్పటివరకు రాధే శ్యామ్ పాటల వల్ల సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఒక ప్రేమకథకు ఎలాంటి సంగీతం కావాలో జస్టిన్ ప్రభాకరణ్. అయితే తాజాగా విడుదలయిన రిలీజ్ ట్రైలర్‌లో మాత్రం తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి మరింత స్పష్టంగా వివరించారు. ఎప్పటిలాగానే ఇందులో కూడా విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పూజా హెగ్డే బ్యూటీ కూడా మరోసారి రిలీజ్ ట్రైలర్‌లో ఇంప్రెస్ చేసింది. అయితే రిలీజ్ ట్రైలర్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో 'ప్రేమకు, విధికి జరిగే యుద్ధమే' అంటూ రాజమౌళి వాయిస్ ఓవర్‌లో వచ్చే డైలాగ్ రిలీజ్ ట్రైలర్‌కే హైలెట్.
Love. Destiny. Action. Presenting the #RadheShyamReleaseTrailer💕#RadheShyam
— Radhe Shyam (@RadheShyamFilm) March 2, 2022
Telugu: https://t.co/7GyOh8JggO
Hindi: https://t.co/KXd7w80gcD
Tamil: https://t.co/3wpWWEvoR5
Kannada: https://t.co/5vv9zkpukx
Malayalam: https://t.co/Y2xGQnHgLG pic.twitter.com/bYiQmOE7pl