Radhe Shyam Trailer: కాలం రాసిన చందమామ లాంటి ప్రేమకథ 'రాధే శ్యామ్'..
Radhe Shyam Trailer: ‘రాధే శ్యామ్’.. మూవీ టీమ్ చెప్తున్నట్టుగా ఇది ఓ అందమైన ప్రేమకథ.;
Radhe Shyam Trailer (tv5news.in)
Radhe Shyam Trailer: 'రాధే శ్యామ్'.. మూవీ టీమ్ చెప్తున్నట్టుగా ఇది ఓ అందమైన ప్రేమకథ. కానీ ఆ ప్రేమకథ ఎలా ఉంటుంది, పీరియాడిక్ లవ్ స్టోరీలు ఈకాలం ఆడియన్స్‌ను మెప్పించగలుగుతాయా అని చాలామందికి సందేహం ఉండేది. కానీ ఒక్క ట్రైలర్‌తో ఆ సందేహాలన్నింటికి సమాధానం ఇచ్చేశాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
రాధే శ్యామ్ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒకప్పటి ఎవర్‌గ్రీన్ ప్రేమకథ 'టైటానిక్'ను గుర్తుచేసేలా ఉంది. ఒక్క ఫైట్ కూడా లేకుండా, పెద్దగా యాక్షన్ సీన్స్ ఏమీ లేకుండా ఈ ట్రైలర్ పూర్తిగా ప్రేమతోనే నిండిపోయి ఉంది. డైలాగ్స్‌ను వింటున్నంత సేపు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లనే పెట్టాడు అని అనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా స్పష్టం చేశాడు.
రాధే శ్యామ్ ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తుంటే సినిమాలో పీరియాడిక్ ఫీల్ ఏ ఫ్రేమ్‌లోని మిస్ అవ్వలేదు అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పాటలు, టీజర్‌తో ఆకట్టుకున్న రాధే శ్యామ్.. ఇప్పుడు ట్రైలర్‌తో మరిన్ని అంచనాలు పెంచేసింది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆర్ఆర్ఆర్' లాంటి మరో పీరియాడిక్ యాక్షన్ సినిమాతో రాధే శ్యా్మ్ పోటీపడనుంది.