దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్ లో విలక్షణ పాత్రల్లో నటించిన రాధిక తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'లయన్', 'లెజెండ్' చిత్రాలు చేసింది. లెజెండ్' తర్వాత రాధిక మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ సంగతి పక్కన పెడితే తాను దక్షిణాదిన నటించిన ఓ చిత్రం షూట్ సందర్భంగా హీరో తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదీ భామ. ఆమెకూ ఇక్కడి వాళ్లు ఛాన్సులివ్వలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రంలో రాధిక హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ .. బేసిగ్గా తెలుగు చిత్రమే. ఇందులో ఇప్పటికే టబు ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. కాస్టింగ్ క్యూరియాసిటీ పెంచడంలో పూరి సక్సెస్ అవుతున్నాడు. అయితే స్క్రిప్టులోనూ బలం ఉండి, టేకింగ్ లోనూ ఒకప్పటిలా మెరుపులు మెరిపిస్తే జగన్నాథ్ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమంటున్నారు సినీ పండితులు.