సమంత పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడమోరుతో పెళ్లైపోయింది. ఇందుకోసం ఆధ్యాత్మికమైన పెళ్లి చేసుకుంది అనే టాక్ వచ్చింది. అవన్నీ ఎలా ఉన్నా తను మాత్రం మూడు ముళ్లతో ఒక బంధం మొదలుపెట్టింది. అయితే తను రాజ్ నిడమోరుతో గతంలోనే ఒక రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది అనే టాక్ వచ్చింది. సమంత విడాకులు తర్వాత ఈ కొత్త బంధం స్టార్ట్ అయిందన్నారు. దానికి ముందు సమంత, నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఫ్యామిలీ మేన్ 2 సిరీస్ తో రాజ్ నిడమోరుతో ఒక అనుబంధాన్ని కలిగి ఉంది. తర్వాత సమంత.. నాగ చైతన్యతో విడిపోయింది. ఆ టైమ్ లోనే కొత్త బంధాన్ని రాజ్ నిడమోరుతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు పెళ్లైపోయింది. ఇంత వరకు బానే ఉంది. అయితే అసలు రాజ్ నిడమోరు మొదటి భార్య గురించి మాత్రం ఎక్కువగా ఎవరికీ తెలియదు. బట్ ఇప్పుడు తెలిసింది. యస్.. రాజ్ నిడమోరు మొదటి భార్య పేరు శ్యామలి. ఆమె అతనితో విడిపోయింది. అప్పుడు కూడా దర్శకుడు వల్లే తను విడిపోయింది అనే టాక్ వచ్చింది. అందుకు కారణాలేంటనేది కరెక్ట్ గా తెలియదు. తను పెళ్లి చేసుకుంది, విడిపోవడం కూడా కూడా చాలా యేళ్లవుతోంది. అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా రంగ్ దే బసంతి, ఓమ్ కార వంటి మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసి ఉంది. తర్వాత రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో 2014 టైమ్ లో చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ హ్యాపీ ఎండింగ్ అనే చిత్రానికి సూపర్ విజన్ కూడా చేసింది. ఇంత నేపథ్యం ఉన్న శ్యామలీ.. రాజ్ నిడమోరు, సమంతో పెళ్లి చేసుకోవడం పట్ల మొదట రియాక్ట్ అయ్యింది. అంతకుముందు అతని లవర్స్ డే స్పెషల్ గా చేసిన గ్రీటింగ్స్ కూడా హల్చల్ చేసింది.
ఫైనల్ గా శ్యామిలీ ఈ పెళ్లి గురించి ఒక మాట చెప్పేసింది. ‘డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్(నిరాశ చెందిన వ్యక్తులు నిరాశాజనకమైన పనులు చేస్తారు)’.. ఇదీ తన పోస్ట్. సమంత, రాజ్ పెళ్లి అయిన వెంటనే ఈ పోస్ట్ పెట్టడం మాత్రం వైరల్ గా మారింది. కాకపోతే తన పోస్ట్ లో ఎవరి గురించీ చెప్పకపోవడం మాత్రం విశేషం.
మొత్తంగా శ్యామిలీ మాత్రం తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా పనులు చేసి ఉన్నా.. ఇప్పటికీ ఎక్స్ వైఫ్ రాజ్ నిడమోరు అనే ట్యాగ్ లైన్ తో మాత్రమే కనిపించడం పట్ల కూడా కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.