Raj Tharun : హైకోర్టులో లావణ్యపై రాజ్ తరుణ్ పిటిషన్

Update: 2024-08-02 09:01 GMT

హీరో రాజ్ తరుణ్ ( Raj Tharun ) గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నానంటూ రాజ్ తరుణ్ కొంత సమయం అడిగారు. తాజాగా లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ అనంతరం నార్సింగ్ పోలీసుల ఆదేశాలు తీసుకున్న తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలుపుతూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News