రాజా సాబ్ వర్సెస్ జన నాయగన్.. ఈ రెండూ ప్యాన్ ఇండియా మూవీస్ గానే హైలెట్ అవుతున్నాయి. అయితే ఈ రెండు మూవీస్ లో ఓవర్శీస్ లో ఎవరెక్కువగా ఆకట్టుకుంటున్నారు అనేది మాత్రం హైలెట్ అవుతున్నాయి. ఓ రకంగా చూస్తే ఈ రెండు సినిమాల్లో కాస్త ఎక్కువ హైప్ ఎవరికి ఉంది అంటే మాత్రం జన నాయగన్ కే అంటున్నారు చాలామంది. ముఖ్యంగానే ఓవర్శీస్ మార్కెట్ లో చూస్తే ఇది అర్థం అవుతోంది. అలాగే తెలుగు ఆడియన్స్ కూడా కాస్త జన నాయగన్ కే ఎక్కువ హైప్ ఇస్తున్నారు అనేది మాత్రం అర్థం అవుతోంది. మరి ఆ రెండు సినిమాలకు ఈ తేడా ఎందుకు వస్తోంది అనేది చూస్తే సింపుల్. జన నాయగన్ విజయ్ లాస్ట్ మూవీగానే చూస్తున్నారు. రాజా సాబ్ మాత్రం ప్రభాస్ మూవీస్ లో మరోటి అన్నట్టుగా కనిపిస్తోంది.
హెచ్ వినోద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ జన నాయగన్ ఓ రకంగా భగవంత్ కేసరి మూవీకి రీమేక్ లానే కనిపిస్తోంది అంటున్నారు. బాలయ్య క్యారెక్టర్ ను విజయ్ అచ్చంగా దించేస్తున్నాడు అంటున్నారు. అయితే భగవంత్ కేసరిలో కొన్ని సీన్స్ మాత్రమే తీసుకున్నారు మిగతా అంతా మార్చారు అనే టాక్ కూడా ఉంది. తమిళ్ లో మాత్రం ఈ మూవీకి తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఆ టైమ్ లో మరో సినిమాపై హైప్ తీసుకు రావడానికి కూడా చాలామంది భయపడతారు. అటు ఓవర్శీస్ లో కూడా అదే కనిపిస్తోంది.
ఇక రాజా సాబ్ మాత్రం కాస్త తేడాగా కనిపిస్తోంది అంటున్నారు. ఓటిటి మార్కెట్ కావడం బాగా ఆలస్యం అయిందనే టాక్ మైనస్ అయింది. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఉండగా కూడా మార్కెట్ లో స్పీడ్ లేవడం మైనస్ అవుతోంది. రిలీజ్ కావడానికి చాలా తక్కువ టైమ్ కూడా ఇందుకు ఓ కారణం. కంటెంట్ పరంగా హారర్ కామెడీ అనగానే కూడా ప్రభాస్ లాంటి స్టార్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయని జానర్ ఇది అంటున్నారు. అతను ప్రయోగంలా చేయడం ఓ కారణం అయినా.. అలాంటి స్టార్ తో ఇలాంటి కామెడీలు చేయడం సమస్య అవుతుంది అంటున్నారు. మొత్తంగా ఓవర్శీస్ వరకు చూస్తే ఈ రెండు సినిమాల్లో కాస్త జన నాయగన్ విషయంలో మాత్రం స్పష్టంగా డామినేట్ చేసినట్టు కనిపిస్తోంది.
మరో క్లారిటీ ఏంటీ అంటే.. ఈ రెండు సినిమాల్లో రాజా సాబ్ ది బిగ్ మూవీ అనే ట్యాగ్ ఉంది. అతను తెలుగుతో పాటు హిందీలో కూడా తిరుగులేని మార్కెట్ ఉన్న స్టార్. జన నాయగన్ కారణంగా కేవలం తమిళ్ లో కాస్త ఇబ్బంది పడినా మిగతా సౌత్ మొత్తం ఆకట్టుకునే అవకాశం ఉంది. అదే పాయింట్ తోనే జన నాయగన్ కూడా కనిపిస్తోంది. సింపుల్ గా చూస్తే.. సౌత్ మొత్తం జన నాయగన్ డామినేషన్ కాస్త ఎక్కువ కనిపిస్తున్నా.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో తిరుగులేని డామినేషన్ లో ప్రభాస్ కు కనిపించడం ప్లస్ అవుతోంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం మైనస్ కావడం ఇబ్బందే. లేదూ రెండు సినిమాలూ ఆకట్టుకున్నాయా.. నెక్ట్స్ సంక్రాంతి మూవీస్ తో రాజా సాబ్ వసూళ్ల పరంగా ఇబ్బంది పడుతుంది అనుకోవచ్చు.