Ishitha Koduri: అందరినీ ఆశ్చర్యపరుస్తున్న రాజమౌళి మేనకోడలు ఇషితా కోడూరి..

Ishitha Koduri: ఒకప్పుడు కొన్ని ఆటలు మగవారు మాత్రమే ఆడాలి అన్న రూల్ ఉండేది..

Update: 2021-10-31 11:14 GMT

Ishitha koduri (tv5news.in)

Ishitha Koduri: ఒకప్పుడు కొన్ని ఆటలు మగవారు మాత్రమే ఆడాలి అన్న రూల్ ఉండేది.. అమ్మాయివి ఇది నువ్వేం ఆడగలవు అన్న చిన్నచూపు ఉండేది.. కానీ రోజులు మారాయి. ఆటకు అమ్మాయి, అబ్బాయి అని తేడా లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా స్పోర్ట్స్‌లో తమ సత్తాను చాటగలరు అని చెప్పుకునే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అందులోకి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అమ్మాయి కూడా చేరింది.

దర్శక ధీరుడు రాజమౌళి కోడలు ఇషిత కోడూరి హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో ప్లేయర్. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. కానీ తాజాగా జరిగిన ఉమెన్ అండర్ 19 ఆటల్లో ఇషిత ఆటకు ఒక్కసారిగా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు.

ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉమెన్ అండర్ 19 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్‌తో హైదరాబాద్ టీమ్ తలపడింది. అందులో బౌలర్‌గా ఇషిత అందరినీ వావ్ అనిపించింది. ఈ మ్యాచ్‌లో ఇషిత మూడు వికెట్లను తీసింది. దీని వల్ల ఆ మ్యాచ్ హైదరాబాద్ గెలవడానికి చాలా ఉపయోగపడింది. దీంతో చాలా సంతోషించిన రాజమౌళి.. ఈ వార్తను తన ట్విటర్‌లో షేర్ చేశారు.


'స్పోర్ట్స్ ఫ్యాన్‌గా నేను నా పిల్లలను ఆ ఫీల్డ్‌లోకి పంపాలనుకున్నాను. కానీ వారు వారి ఇష్టప్రకారం వేర్వేరు ఫీల్డ్స్‌ను ఎంచుకున్నారు. కానీ నా మేనకోడలు ఇషితా కోడూరి.. హైదరాబాద్ స్టేట్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యి ఈరోజు హిమాచల్ ప్రదేశ్‌కు పోటీగా ఆడనుంది. ఆల్ ది బెస్ట్ తల్లి' అంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News