Rajamouli : రాజమౌళి కుంభ ఓ అద్భుతం

Update: 2025-11-07 07:41 GMT

ఓయమ్మా రాజమౌళి.. తన క్యారెక్టర్స్ ను మార్చినాడు కదా. తన పాత్రల గురించి మాట్లాడటం మాత్రం మొదలుపెట్టాడు. అసలు ఇప్పటి వరకు ఎవరు ఏం చేసినారు.. ఏం చేస్తున్నారు అనే క్యారెక్టర్స్ ఎక్కడా చెప్పడం లేదు. అలాంటిది ఫస్ట్ టైమ్ తన విలన్ ఫేస్ తో పాటు ఏకంగా పేరునే కూడా చెబుతూ పరిచయం చేయడం చూడ్డం మాత్రం గొప్ప విషయమే. అతని విలన్ గురించి మాత్రం అతని మాటల్లో చెప్పడం చూస్తుంటే జక్కన్న ఎంత మారిపోయాడో అనిపించేది కదా. మరి విలన్ గురించి ఎంతలా చెప్పడం చూస్తుంటే అబ్బో మనోడు అతగాడి లవ్ లో పడిపోయాడు అని అర్థం అవుతోంది.

'పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో జారిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు... అక్షరాలా..' ఇదీ రాజమౌళి తన పాత్ర కుంభ గురించి చెప్పడం మాత్రం ఎంతలా గొప్పగా అనిపించేలా ఉందనే చెప్పాలి.

ఈ నెల 15నే ఈ మూవీ వీడియో పాత్రల గురించి ముందుగానే చెప్పబోతున్నాడు రాజమౌళి. అందులో భాగంగా విలన్ పాత్ర గురించే ముందుగా చెప్పాడు. ఆ పాత్ర గురించి ఈ క్యారెక్టర్ ను పరిచయం చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ క్యారెక్టర్ ను పరిచయం చేయబోయాడు. ఆ పాత్రలో అతను ఒక వాలు కుర్చీలో కూలబడి ఉన్నాడు. అంతే కాదు.. ఆ పాత్రలో ఆ వాలు కుర్చీలోనే ప్రపంచం మొత్తాన్ని కదిలించబోతున్నాడని కూడా చెబుతున్నాడు. ఆ కుర్చీతో పాట కనిపించే గెటప్ కూడా కొత్తగానే ఉండబోతున్నాడు. మొత్తంగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ పాత్రలో చాలా గొప్పగా కనిపించబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. మరి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎలా ఉండబోతోందో... అంతకు మించి హీరోగా మహేష్ బాబు పాత్రలో కనిపించబోతున్నారో మరి.

Tags:    

Similar News