Raja Saab : రాజాసాబ్@400 కోట్లు

Update: 2024-12-04 05:53 GMT

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. ది పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండేళ్లుగా చూసుకుంటే.. పీపుల్ మీడియా సంస్థ నిర్మించిన సినిమాల్లో మనమే, విశ్వం మినహా మిగిలినవన్నీ డిజాస్టర్లు అయ్యాయి. కొన్నింటిని ఓటీటీలో విడుదల చేసుకునేందుకు చాలా కష్టపడందా సంస్థ. ఇప్పుడు ఆ సంస్థకు ఉ న్న ఏకైక హోప్ రాజాసాబ్. ఇప్పటివరకు రూ.350 కోట్ల బడ్జెట్ పెట్టారు. 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రానికి మొత్తంగా రూ.400 కోట్లు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రీసెంట్గా రాజాసాబ్ చిత్రం నుంచి మాళవిక మోహనన్ ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి అయిందని.. మరికొన్న రోజులు మాత్రమే ఉందని నెట్టింట పోస్ట్ ద్వారా వెల్లడించింది. హారర్ అండ్ ప్రేమ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లైతే.. మారుతీ డైరెక్షన్లో రూపొందుతోన్న రాజాసాబ్ నుంచి ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఫస్ట్ టైం డిఫరెంట్ గెటప్లో నటిస్తుండడం.. అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ టీజర్ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Tags:    

Similar News