Rajendra Prasad : రాజేంద్రుడు బూతేంద్రుడు

Update: 2025-06-02 13:57 GMT

రాజేంద్ర ప్రసాద్.. నటుడుగా తిరులేని ప్రతిభ ఉన్నవాడు. తెలుగు నుంచి ఫస్ట్ కామెడీ హీరోగా స్టార్డమ్ అందుకున్నాడు. ఏ పాత్రైనా అదరగొట్టగల టాలెంట్ అతని సొంతం. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా చాలా బిజీగా ఉన్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం వరకూ కాస్త బానే ఉండేవాడు రాజేంద్ర ప్రసాద్. కాకపోతే కాస్త వాగుడుకాయ. మైకాసురుడు. మైక్ దొరికితే వదలడు. అందులోనూ సొంత డబ్బా ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు ఆ దశ దాటి వేదికపై బూతులు మాట్లాడ్డం.. తన తోటి వారిపట్ల అత్యంత అమార్యదగా ప్రవర్తించడం చేస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితం రాబిన్ హుడ్ మూవీ ఫంక్షన్ లో ఇంటర్నేషనల్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వాడు వీడు అని సంబోధించి సోషల్ మీడియా ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత సారీ లాంటిది చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత షష్టిపూర్తి మూవీ వేడుకలో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన అర్చనను ఏమే ఏమే అని సంబోధించడమే కాక నల్ల పిల్ల అంటూ ఆమె చిన్నబుచ్చుకునేలా మాట్లాడాడు. అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా.. పదిమందిలో ఉన్నప్పుడు కనీస గౌరవం ఇవ్వడం సంస్కారం. అది రాజేంద్ర ప్రసాద్ లో పూర్తిగా లోపించింది. సంస్కార లేమిని దాటి దిగజారుడు స్థాయికి వచ్చాడు తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఫంక్షన్ లో.

ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఫంక్షన్ కు వచ్చిన వాళ్లంతా అత్యంత హుందాగా మాట్లాడారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం నటుడు అలీని పిలుస్తూ.. ఏడీ వాడు లం.. కొడుకు అని వేదికపైనే అనడం అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే రోజాను ఉద్దేశిస్తూ.. ‘దాన్ని నేనే హీరోయిన్ ను చేశా’ అన్నాడు. ఆమె తనతో హీరోయిన్ గా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాజీ మంత్రి. ఆ కనీస స్పృహ లేకపోవడం చూస్తుంటే అతను ఏ స్థితిలో వేదికలపై మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత దిగజారుడు వ్యక్తిత్వం ఉన్న మనిషి నిజంగా సినిమా సెట్స్ లో ఆడవారితో అప్పట్లో ఎంత దారుణంగా ప్రవర్తించి ఉండేవాడో ఊహించుకుంటేనే పాపం ఆ హీరోయిన్లు ఇతని వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారో అర్థం అవుతుంది.

తను చేసిందే అసహ్యం అంటే పైగా దాన్ని సమర్థించుకుంటూ.. తనను తప్పుగా అర్థం చేసుకున్నవారికే సంస్కారం లేదు అన్నాడు. దీన్ని బట్టి చూస్తే అతని మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలుస్తుంది. ఇకనైనా ఇలాంటి వాగుడుకాయలు, సంస్కార హీనులను పబ్లిక్ ఫంక్షన్స్ కు అవాయిడ్ చేస్తే బెటర్. లేదంటే ఏదో రోజు సినిమా మొత్తానికే డ్యామేజ్ అయ్యే డైలాగ్స్ కూడా వేస్తాడు.

Full View

Tags:    

Similar News