లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కూలీ. ఇప్పటికే లోకేష్ సినీ వర్స్ ను క్రియేట్ చేసి భారీ విజయాలు సాధిస్తున్నాడు ఈ దర్శకుడు. అన్నీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్సే కావడం విశేషం. కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ తో ఆయన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చాడు. విజయ్ తో చేసిన బీస్ట్ కాస్త తేడాగా అనిపించినా వసూళ్లు వచ్చాయి. బీస్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న లోకేష్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే ఈ మూవీలో భారీ తారాగణాన్ని తీసుకున్నాడు. రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిర్ షబిన్, శ్రుతి హాసన్, సత్యరాజ్, రెబా మోనికా జాన్ వంటి ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించాడు. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న కూలీ బడ్జెట్ లో సగానికి పైగా రజినీకాంత్ రెమ్యూనరేషకే పోవడం విశేషం. ఇక నాగ్ రెమ్యూనరేషన్ తెలుగుతో పోలిస్తే భారీగానే ఉన్నా.. వీరి మధ్య వ్యత్యాసం మాత్రం రజినీ రేంజ్ ను చూపిస్తోంది.
కూలీ చిత్రానికి రజినీకాంత్ కు ఏకంగా 260 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట. 72 యేళ్ల వయసులో రజినీకాంత్ రెమ్యూనరేషన్ చూస్తే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో అంత పారితోషికం తీసుకుంటోన్న నటుడు ఇండియాలోనే ఇంకెవరూ లేరని చెప్పాలి. ఇక నాగార్జున చేసిన సైమన్ పాత్ర ఈ చిత్రానికి అత్యంత కీలకం అంటున్నారు. చాలా వరకూ ఆయనది నెగెటివ్ రోల్ అనేది ముందే చెప్పారు. నాగ్ కు ఈ చిత్రానికి 24 కోట్లు ఇచ్చారట. తెలుగులో ఆయన మార్కెట్ కు 10 కోట్లకు మాత్రమే ఉంది. అంటే డబుల్ పే చెక్ వచ్చేసిందని చెప్పాలి. కానీ రజినీకాంత్ తో పోలిస్తే నాగ్ ఎక్కడో ఆగిపోయాడు అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో కేమియోతో పాటు ఓ పాటలోనూ నర్తించిన పూజా హెగ్డేకు ఏకంగా 2 కోట్లు ఇచ్చారట. సో.. బడ్జెట్ లో మాగ్జిమం రజినీకాంత్ కే పోయిందన్నమాట.