రెండు ప్యాన్ ఇండియా మూవీస్ మధ్య బాక్సాఫీస్ వార్ అంటే ఆడియన్స్ ఓ క్రేజ్ ఉంటుంది. అభిమానుల్లో కూడా పోటీ కనిపిస్తుంది. ఆ రెండు సినిమాలు ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద అప్పర్ హ్యాండ్ సాధించాలని ప్రయత్నిస్తారు. బట్ చూస్తుంటే ఈ విషయంలో వార్ 2 కంటే కూలీయే ముందు ఉందేమో అనిపిస్తోంది. తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్, సోషల్ మీడియా బజ్ పరంగా చూస్తే సూపర్ స్టార్ మూవీ సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా సౌత్ లో కూలీ డామినేషన్ అన్ని భాషల్లోనూ చాలా ఎక్కువగా ఉంది అనేది వాస్తవం.
కూలీ, వార్ 2 రెండూ ఒకే రోజు విడుదలవుతున్నాయి. రెండిటిలోనూ పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. రెండూ తెలుగు వరకు డబ్బింగ్ సినిమాలే. అంచేత ప్రమోషన్స్ పరంగా దూకుడు చూపించాలి. కూలీ ఆల్రెడీ తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. శ్రుతి హాసన్, సత్యరాజ్, లోకేష్ వంటి వాళ్లు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ తో హోరెత్తిస్తున్నారు. ఇటు చూస్తే వార్ ట్రైలర్ తర్వాత పట్టించుకోవడమే మానేశారు. ఈ 10న ఏపిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు అని చెబుతున్నారు. అది మాత్రమే పెద్ద ఈవెంట్ అవుతుంది. అంతే.. ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళ వంటి చోట్ల కేవలం ప్రెస్ మీట్స్ తో మమ అనిపిస్తారేమో.
ఏదేమైనా.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై రజినీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ ల డామినేషన్ స్పష్టంగా ఉంది. కంటెంట్ గా ఎవరికి ఎక్కువ మార్కులు పడితే బాక్సాఫీస్ కూడా అటువైపే వెళుతుంది. బట్ సాలిడ్ ఓపెనింగ్స్ రావాలన్నా ప్రమోషన్స్ కావాలి కదా అనేది సగటు అభిమాని ఫీలింగ్.