సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిర్ షబీన్, శ్రుతి హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. లోకేష్ కనకరాజ్ ఇప్పటికే దర్శకుడుగా ఓ పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాడు. లియో లాంటి మూవీ యావరేజ్ అయిన కలెక్షన్స్ వచ్చాయి అంటే హీరోల ఇమేజ్ లను కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాడు అని అర్థం. మరి ఈ ఏజ్ లో కూడా బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తోన్న రజినీకాంత్ లాంటి స్టార్ తో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా..? యస్.. కూలీపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి టైటిల్ చాలా పెద్ద ప్లస్ అని అందరికీ తెలుసు. ఆ టైటిల్ నే ఇప్పుడు మార్చబోతున్నారు.
కూలీ టైటిల్ క్యాచీగా ఉంటుంది. మాస్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే హిందీలో మాత్రం ఈ టైటిల్ ఛాన్స్ లేదట. అక్కడ ఆల్రెడీ ఆ టైటిల్ తో సినిమా వస్తోందా లేక ఏదైనా టైటిల్ రిజిస్టర్ అయి ఉందా అని తెలియదు కానీ.. హిందీ వరకూ ఈ చిత్రానికి ‘మజ్దూర్’ అనే టైటిల్ పెట్టేస్తున్నారు. అఫ్ కోర్స్ మజ్దూర్ అన్నా కూడా కూలీ అనే అర్థం. సో.. వాళ్లు హిందీలో కూలీ అనుకుంటున్నారు. మనం మాత్రం ఇంగ్లీష్/ తెలుగులో కూలీ అనేసుకుంటున్నాం అంతే.