Kanguva vs Vettaiyan : రజినీ కోసం సూర్యది త్యాగం కాదా..

Update: 2024-09-02 10:07 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయాన్ మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. జై భీమ్ ఫేమ్ టి.జి జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడానికి ముందే సూర్య హీరోగా నటించిన కంగువా మూవీని అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సూర్యపై రజినీకాంత్ కావాలనే పోటీకి దిగాడు అనే కమెంట్స్ వినిపించాయి. ఇద్దరూ పోటీ పడితే రెండు సినిమాలూ లాస్ అవుతాయని కొత్త లెక్కలు, లాజిక్ లు తీశారు. రజినీకాంత్ సూర్యపై పోటీకి రాకుండా ఉండాల్సింది అనే కొంతమంది సూర్యపై సానుభూతిని కూడా ప్రకటించారు. దీంతో తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అనౌన్స్ చేశాడు సూర్య.

అనౌన్స్ చేయడమే కాదు.. ఏకంగా రజినీకాంత్ లాంటి స్టార్ మాకు సీనియర్. 40యేళ్లుగా తమిళ్ సినిమా ఐడెంటిటీగా ఉన్నారు ఆయన అంటూ ఆకాశానికెత్తే ప్రయత్నమూ చేశాడు. ఇది మరో రకంగా వివాదం అవుతోంది. రజినీ మాత్రమే తమిళ్ సినిమా ఐకనా.. ఇతరులు కాదా అంటూ ఇంకొందరు సూర్యపై కామెంట్స్ చేస్తున్నారు. అవెలా ఉన్నా.. సూర్య తప్పుకున్నందుకు మావోడిది గొప్ప త్యాగం అంటూ అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. బట్ ఇక్కడే రజినీకాంత్ ఫ్యాన్స్ కు మండింది. అసలు ఎవరు ముందు డేట్ అనౌన్స్ చేశారు అంటూ పాత పోస్ట్ లు బయటకు తీస్తున్నారు.

అలా చూస్తే రజినీకాంత్ వేట్టైయాన్ మూవీని అక్టోబర్ లో విడుదల చేస్తాం అని ఏప్రిల్ లోనే ప్రకటించారు. మరి అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ దసరా అనే కదా అర్థం. ఆ తర్వాత కంగువా రిలీజ్ డేట్ ను జూన్ లో ప్రకటించారు. అంటే రజినీకాంత్ సినిమా ఉంటుందని తెలిసి కూడా కంగువాను అనౌన్స్ చేశారు. ఇప్పుడేమో రజినీకాంత్ కోసం తప్పుకుంటున్నాం అంటూ కవరింగ్స్ చేస్తున్నారు అని రజినీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

మొత్తంగా సూర్యది త్యాగం అనుకునే లోపే అంత సీన్ లేదు అంటూ అసలు విషయం అదే సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో చూపిస్తున్నారు రజినీ ఫ్యాన్స్.

Tags:    

Similar News