Raju Gari Ammayi Naidu Gari Abbayi : రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజ్

'రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి' నుంచి అప్ డేట్.. 'ఐ లవ్ యు' లిరికల్ సాంగ్ విడుదల..;

Update: 2023-08-30 05:10 GMT

రవితేజ నున్న, నేహ జురెల్ 'రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి' ద్వారా హీరో, హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. డైరెక్టర్ సత్య రాజ్ కూడా ఈ మూవీతోనే దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. కాగా తాజాగా 'రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి' చిత్రం నుండి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఐ లవ్ యు' లిరికల్ సాంగ్ విడుదలైంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పాట మధురమైన సంగీతం, చక్కని సాహిత్యంతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షిస్తోంది. రెహమాన్ రచించిన ఈ చిత్ర గీతాన్ని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. 'ఐ లవ్ యు' అనే పాట చిత్ర బృందం అంకితభావం, కృషికి నిదర్శనం. చిత్ర నాయికా నాయకులపై చిత్రీకరించబడ్డ ఈ గీతం యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ పాట విడుదలకు ముందే విడుదల అయిన 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' టీజర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కొద్ది రోజులలోనే థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.


Full View


Tags:    

Similar News