Raju Weds Rambai : 20 కోట్లు, 100 మిలియన్స్ అంటా

Update: 2025-12-30 08:08 GMT

కొన్ని సినిమాల రివ్యూస్ తోనే బలే గట్టెక్కుతాయి. అలంటిదే రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీ సాధించిన విజయం మాత్రం చాలా పెద్దది. ఇంత పెద్ద విజయం సాధించిన సినిమాలు అంటే మామూలుగా ఓటిటిలో లైట్ తీసుకుంటారు చాలామంది. బట్ రాజు వెడ్స్ రాంబాయి మాత్రం ఓటిటిలో కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతోంది. కేవలం 3 లేదా 3న్నర కోట్లతో మాత్రమే రూపొందింది ఈ మూవీ. బట్ ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం 20 కోట్ల వరకు వచ్చాయి అని అంచనా వేశారు. మామూలుగా ఈ మూవీ నవంబర్ 21న విడుదలైంది. తర్వాత డిసెంబర్ 18న ఓటిటిలో విడుదల చేశారు. ఓటిటిలో కూడా అదరగొట్టి ఏకంగా 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమ్ అయిన మూవీగా రికార్డులకెక్కింది. ఈటీవి విన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇంకా మరికొన్నిమిలియన్ మినిట్స్ వ్యూస్ సంపాదించేలా ఉంది.

ఇక అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించిన ఈ మూవీ చైతు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటించాడు. కాంపాటి సాయిలు డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. శివాజీ రాజా, అనితా చౌదరి, కవిత శ్రీరంగం ఇతర పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. ఇక ఈ మూవీతో దర్శకుడుగా అతను మరో మెట్టు పైకి ఎక్కినట్టుగానే కనిపిస్తాడు సాయిలు కాంపాటి. మరి తొలి చిత్రంతోనే ఇలాంటి ఘనమైన విజయాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు కదా.

Tags:    

Similar News