Ram Charan Upasana: మెగాస్టార్ భార్యకు రామ్ చరణ్, ఉపాసన క్యూట్ విషెస్..

Ram Charan Upasana: ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోలో సురేఖను బెస్ట్ మామ్ ఇన్ లా అని అన్నారు.

Update: 2022-02-18 13:05 GMT

Ram Charan Upasana: మెగా ఫ్యామిలీలో హీరోలు తప్ప మిగతా ఎవ్వరూ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. సందర్భం వస్తే తప్ప ఏదీ పోస్ట్ చేయరు. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి భార్య, రామ్ చరణ్ తల్లి సురేశ్ కొణిదెల పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ చెప్తోంది మెగా ఫ్యామిలీ. అయితే అందరికంటే ఎక్కువగా సురేఖ కోడలు ఉపాసన బర్త్‌డే విషెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన.. తన పదేళ్ల వైవాహిక జీవితంలోని కొన్ని గుర్తులను ఓ వీడియోలాగా చేశారు. అంతే కాకుండా లవర్స్‌కు కొన్ని విలువైన టిప్స్ కూడా ఇచ్చారు. అలాగే తన అత్త సురేఖ కొణిదెల పుట్టినరోజుకు కూడా అలాంటి ఒక వీడియోనే తయారు చేశారు ఉపాసన. అయితే ఈ వీడియోలో వారిద్దరు కలిసి కుటుంబంతో సంతోషంగా గడిపిన సందర్భాలు ఉన్నాయి.

ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోలో సురేఖను బెస్ట్ మామ్ ఇన్ లా అని అన్నారు. అంతే కాకుండా తన వైవాహిక జీవితంలో ఆమె చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు అన్నారు ఉపాసన. మరోవైపు రామ్ చరణ్ కూడా తన తల్లికి క్యూట్‌గా విషెస్ తెలిపారు. 'ఆచార్య' సెట్‌లో చిరంజీవితో, తన తల్లి సురేఖతో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన చరణ్.. 'నీకు నేను తెలిసినంతగా ఎవరికీ తెలీదు. హ్యాపీ బర్త్‌డే మా' అని క్యాప్షన్ పెట్టాడు రామ్ చరణ్.


Tags:    

Similar News