Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో షేర్ చేసిన ఎన్‌టీఆర్..
Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్‌టీఆర్ మధ్య ఎంత బాండింగ్ ఉందో ప్రేక్షకులు చూశారు;
Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులంతా తనకు విషెస్ తెలిపుతూ తమ అభిమాన హీరో బర్త్ డేను వారే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రామ్ చరణ్ బర్త్ డేను ఓ పండలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎన్‌టీఆర్ కూడా రామ్ చరణ్ కోసం ఓ స్పెషల్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బర్త్ డే పార్టీ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ కూడా చేశాడు ఎన్‌టీఆర్.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లకు కెరీర్స్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఇచ్చింది. ఈ హిట్ జోష్‌లోనే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా ఎన్‌టీఆర్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. అందులో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్. ఎన్‌టీఆర్.. చరణ్ పుట్టినరోజున ఏం చేస్తాడు.. వారిద్దరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఎన్‌టీఆర్, అందుకే వారి ఫ్యాన్స్ కూడా ఉదయం నుండి బర్త్ డే సెలబ్రేషన్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్‌టీఆర్ మధ్య ఎంత బాండింగ్ ఉందో ప్రేక్షకులు చూశారు. వారు కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య ఓ బలమైన ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందని తెలిపారు. అయితే ఎన్‌టీఆర్ షేర్ చేసిన చరణ్ బర్త్ డే వీడియోలో కూడా వీరి బాండింగే హైలెట్‌గా నిలుస్తోంది. ఈ వీడియో చూసి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.