అభిమానులు అంత దూరం నుంచి నడిచి వచ్చారని తెలిసి చరణ్..
తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూడగానే నడిచి వచ్చిన శ్రమని మర్చిపోతారు.;
సినిమా నటీనటులే వాళ్ల ఆరాధ్య దైవాలు. వాళ్ల కోసం వందల కిలోమీటర్లు నడుస్తారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూడగానే నడిచి వచ్చిన శ్రమని మర్చిపోతారు. తాజాగా నటుడు రామ్ చరణ్‌ని చూడ్డానికి ముగ్గురు యువకులు జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్‌కు నడిచి వచ్చారు.
నాలుగు రోజుల క్రితం బయలు దేరిన ఆ ముగ్గురు యువకులు 231 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి చరణ్‌ని కలుసుకున్నారు. ఈ విషయం తెలిసి చరణ్ వారి అభిమానానికి ఫిదా అయ్యారు. వారిని సాదరంగా ఆహ్వానించి అప్యాయంగా పలకరించి హగ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
కాగా చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.