Ram Charan : చిక్రితో ఆడేసుకున్నాడు రామ్ చరణ్

Update: 2025-11-07 06:01 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ సాంగ్ పెద్ది నుంచి వచ్చిన పాట మాత్రం అదిరిపోయింది. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందించిన పాటలోని ట్యూన్ మాత్రం ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ స్టెప్పులు ఇరగదీసింది. పెద్దితో కలిసి జాన్వీ చేసిన మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. పాటలోని సాహిత్యం మాత్రం అలరిస్తుంది అనే చెప్పాలి. పెద్దితో హీరోయిన్ ను చూసిన మొదటిసారి చూడగానే అతను మనసు పడేసుకున్నట్టు కనిపిస్తుంది.

ఆ చంద్రుల్లో ముక్కా.. జారిందే నీ నక్కా.. నా ఒళ్లంతా తైతక్కా ఆడిందే .. చిక్రి.. చిక్రీ.. అంటూ సాగే గీతం ఆకట్టుకుంటుంది. విశేషం పాటంతా వీడియో సాంగ్ గానే కనిపించింది. మధ్యలో రహమాన్ తో పాటు సింగర్, బుచ్చిబాబు కూడా ఉన్నారు. కానీ రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్ మాత్రం వీడియో సాంగ్ గానే కనిపిస్తున్నారు. హీరోయిన్ తో ప్రేమలో పడిన కుర్రాడుగానే చరణ్ ఉంటున్నాడు. పాట స్టార్టింగ్ లో అతనితో పాటు క్రికెట్ కూడా కనిపించేలా ఉంది. నిజంగా పాటంతా ఆకట్టుకునేలానే ఉందీ సాంగ్.

రహమాన్ సంగీతం బావుంది. పాట సందర్భానికి తగ్గట్టుగా బాలాజీ రాశాడు. మోహిత్ చౌహాన్ పాడాడు. బుచ్చిబాబు పాటతో అలరించాడు అనే చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గెటప్ తో పాట బాడీ లాంగ్వేజ్ మాత్రం పాటతో అదరగొట్టాడు అనే చెప్పాలి. జాన్వీ కపూర్ మరోసారి పాత్రలో గ్లామర్ రోల్ లో కనిపించబోతోంది అనిపించేలా ఉందనిపిస్తుంది అని చెప్పాలి.

Full View

Tags:    

Similar News