Ram Charan: కన్నీళ్లతో నాన్నను హత్తుకున్నాను: రామ్ చరణ్
Ram Charan: తన తండ్రి చిరంజీవితో వర్క్ చేయడం చాలా గొప్ప విషయమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.;
Ram Charan: మల్టీ స్టారర్‌లకు ఇంతకు ముందుకంటే ఇప్పుడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే చూద్దామని ప్రేక్షకులు ఎదురుచూస్తు్న్నారు. అయితే ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్.. 'ఆచార్య' సినిమాతో వచ్చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్‌లో జరిగిన ఓ ఎమోషనల్ మూమెంట్‌ను పంచుకున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ హీరోగా పరిచయమయినప్పటి నుండి తన తండ్రి చిరంజీవితో పలుమార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ ఆచార్య అలా కాదు. ఇందులో ఈ ఇద్దరూ హీరోలే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ట్రైలర్ ఇప్పటికే విడుదలయ్యి ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.
తన తండ్రి చిరంజీవితో వర్క్ చేయడం చాలా గొప్ప విషయమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఆచార్య వల్ల ఈ అవకాశం కలిగిందని కొరటాల శివకు థాంక్స్ చెప్పుకున్నాడు. ఆచార్య షూటింగ్ సమయంలో 20 రోజుల పాటు తన తండ్రితో కారులో ప్రయాణించడం, తనతో సమయాన్ని గడపడం అన్ని గొప్పగా నిలిచిపోతాయి అన్నాడు రామ్ చరణ్.
తనకు ఒకరోజు కలిగిన అనుభూతిని తన తండ్రికి మాటల్లో వివరించలేక కన్నీళ్లతో హత్తుకునని తెలిపాడు చరణ్. ఇక ఏప్రిల్ 29న విడుదల కానున్న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23న జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్‌లుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి రానున్నట్టు సమాచారం. అయితే ముగ్గురు మెగా హీరోలను ఒకే వేదికపై చూడడం కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.