Ram Charan : హాట్ టాపిక్ గా మారిన రామ్ చరణ్

Update: 2025-03-29 04:42 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఇంకా ఏ అప్డేట్ రాకుండానే హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'పెద్ది' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఊరమాస్ లుక్ తో కనిపిస్తోన్న ఈ స్టిల్ సోషల్ మీడియాను ఊపేసిందనే చెప్పాలి. రంగస్థలంలో మాస్ లుక్ ఉంది. కానీ ఇది ఊరమాస్. ఈ తరహా లుక్ తోఇప్పటి వరకూ ఏ సినిమా చేయలేదు చరణ్. అందుకే సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే టైటిల్ సైతం కొత్తగా ఉంది. అయితే అదే రోజు ఈ మూవీ గ్లింప్స్ కూడా వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ విడుదల చేయడం కుదరలేదు. అయినా ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పెద్ది గ్లింప్స్ వస్తుందా లేదా అనే క్లారిటీ రానే లేదు. అయినా ఈ గ్లింప్స్ కు సంబంధించిన వార్తలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియో ఇన్ని సెకన్స్ ఉంటుంది.. అన్ని సెకన్స్ ఉంటుంది అంటున్నారు. పైగా ఈ వీడియోతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మెగా ఫ్యాన్స్ అండ్ సర్కిల్స్ లో అయితే గ్లింప్స్ తోనే రికార్డులకు బీజం వేయబోతున్నాం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా 18 సెకన్స్ మాత్రమే ఉంటుందనే మాట బలంగా ఉంది. మరీ అంత తక్కువైతే ఏం బావుంటుంది అనేది ఇంకొందరి వెర్షన్. ఏదేమైనా ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ వీడియోకు డబ్బింగ్ చెప్పి ఉన్నాడు చరణ్. దానికి తన ఆర్ఆర్ తో ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నాడు రెహమాన్. మరి అవుట్ పుట్ ఎలా ఉంటుందో కానీ.. అసలు అఫీషియల్ అప్డేట్ లేకుండా ఈ రేంజ్ లో హాట్ టాపిక్ అవుతోందంటే గ్లింప్స్ వస్తే అరాచకమేనేమో. 

Tags:    

Similar News